మాతృ దేవభవ పితృ దేవోభవ ఆచార్య దేవోభవ
6:50 అపరాహ్నం వద్ద నవంబరు 15, 2008 | సూచన లో రాసారు నేను అభిప్రాయములుటాగులు: ఆవేదన, సూచన
తల్లి, తండ్రి, గురువు దైవం అన్నారు పెద్దలు. దీని అర్దం దైవానికి నాలుగో స్దానం ఇచ్చినట్టు కాదు. తల్లి ని, తండ్రి ని, గురువు ని దైవం తో సమానం చేసి గౌరవించాలని అలా అంటారు. ఐతే మూడవ స్దానం లో ఉండవలసిన గురువుని అవమానించడం అనేది మన నిజ జీవితం లో చాలా చోట్ల మనం చూస్తూనే ఉన్నాం, అప్పుడప్పుడు మనం కుడా సహనం దాటి అలా ప్రవర్తిస్తాం. అది చాలదన్నట్టు అలా జరిగిన రోజు మనం మన ఫ్రెండ్స్ తో ఈ విషయం గొప్ప గా చెప్పుకోవటానికి ఆ రోజు సాయంత్రం కోసం తహ తహలాడుతుంటాం. సరే మనం ఆత్రం గా ఎదురు చూసిన సాయంత్రం వచేసింది. మన ఫ్రెండ్స్ కలిసారు నలుగురు ఇంకా రాలేదు మనం వాళ్ళ కోసం ఎదురు చూద్దాం అనుకున్నా మన మనసు మాత్రం మనం చేసిన ఘన కార్యాన్ని ఎప్పుడెప్పుడు వెళ్ళబుచుదామా అని తొందర పెట్టి చివరకు మనం ఎదురుచూసే ఆ నలుగురు రాకుండానే మన హీరోఇజాన్ని గురించి చెప్పేస్తాము. “మా సార్ ని నేను అలా అంటుంటే ఆయన ఆశ్చర్య పోయారు, నా తోటి వారంతా నన్ను మెచ్చుకున్నరు నేను అలా చేసినందుకు” అని చెప్పి గుండె లో దాచుకున్న ఆనందాన్ని పదిమందికి చెప్పేస్తాము. సరే విన్న వారు అయినా అది తప్పు రా అని చెప్తారా అంటే ఈ లోపు మనం ఎదురు చూసిన ఆ నలుగురూ వచ్చి మనల్ని చూసి ఏమిట్రా అందరి లో నూ అంత ఆనందం కనిపిస్తుంది ఏమిటి విషయం అనగానే మన మనసు రెక్కల గుర్రం లాగా ఒక రౌండ్ వేసి వచ్చి వీళ్ళకి కూడా చెప్దామని రెడీ అయ్యే సరికి మన ఘనకార్యమంతా విన్న వాడొకడు ఆత్రం గా మన వాడు ఈ రోజు వాళ్ళ లెక్చరర్ దుమ్ము దులిపేసాడంట అనగానే ఒక రౌండ్ షికారు వెళ్ళి వచిన గుర్రం (అబ్బా అదేనండి మన మనస్సు) ఇంకో కిలోమీటరు పైకెళ్ళి ఆగుతుంది. ఇది మన నిజ జీవితం లో కనీసం ఒక్కసారైనా ఎదుర్కుని ఉంటాం గుర్తుతెచ్చుకోండి. అంతగా ఆలోచించక్కర్లేదు ఖచితంగా 90% మంది ఎదుర్కొన్న సందర్భమే ఇది. ఐతే సినిమాల విషయంలో చూస్తే ఒక ప్రేమ కధలో కానీ, ఒక ఫాక్షన్ కధలో కాని హాస్యాన్ని పండించటానికి వాడుకునే మొట్టమొదటి అస్త్రం ఒక క్లాస్ రూమ్, అందులో ఒక కామెడీ లెక్చరర్. ఇదంతా చదివిన తరువాత ఇందులో ఏముంది వీడు ఇంత సోది చెప్పాడు, సినిమా అంటే నవరసాలూ ఉండాలి కనుక అలా వాడారు అంతే అని మీకు అనిపించవచ్చు. ఇది తప్పుకాదు అని కూడా మీకు అనిపించవచ్చు. అది మీ ఆలొచనాధోరణి కావచ్చు. కానీ అది తప్పు అని నా అభిప్రాయం. గురువు ని అవహేళన చేయటం తప్పు కాదు అనిపించిందో లేక కొన్ని సందర్భాలలో అవహేళన చేసినా ఫర్వాలేదు అనుకున్నారో ఏమో మన సినిమా సెన్సార్ వాళ్ళు అలాంటి సన్నివేశాలను అనుమతించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ తల్లిదండ్రుల మీద అసభ్యకర సంభాషణలను ఎందుకు అనుమతించుతున్నారో? హాస్యానికి మూలం గా ఆఖరికి గురువుని కూడా అపహాస్యంగా చూపించే మన సినీ దర్శకులు కనీసం ప్రజలకు తల్లిదండ్రుల మీద ఉండే గౌరవాన్ని అయిన మిగుల్చుతారని కోటి దేవుళ్ళను కోరుకుంటున్నాను. ఏమిటి వీడేదో చిన్నపాటి యోగి లాగా చెప్తున్నాడనుకుంటున్నారా? నా మనసుని కష్టపెట్టిన రెండు సన్నివేశాల మూలంగా నేను ఇది చెప్తున్నాను. 1. వెంకీ అనే సినిమా లో రవి తేజ తండ్రి తనికెళ్ళ భరణి గారు. వారిద్దరి మధ్య జరిగే సంభాషణ ఇది. తనికెళ్ళ భరణి: నేను వెదవలతో డిస్కషన్ చెయ్యను. రవి తేజ: నేను చేస్తాను. ఈ సంభాషణలకు సినిమా హాలు లో జనం పగలబడి నవ్వారు. ఒక పని వాడు యజమానికి ఇలాంటి చురక వేయటం అనేది మనం చూశాము(“నువ్వు నాకు నచ్చావు” లో) ఇలా తండ్రిని అనటం ఎంతవరకూ సమంజసం? ఇది తప్పు అనిపించట్లేదా మీకు? ఐతే 2. ఇటీవలి “గమ్యం” అనే సినిమా లో ఒక గొడవ కారణం గా రోడ్డు మీద లారీలు వరుసగా ఆగినప్పుడు కధానాయకులు ఇద్దరూ వెళ్ళి అడ్డు తొలగమని చెప్పినప్పుడు ఆ గొడవ పడేవారిలో ఒకరు నాకు చెప్తావేంటి నేను పులి బిడ్డను అంటాడు. (మీరు చదవబోయే తరువాత వాక్యాలను మీరు తెలుసుకుని ఇకనైనా ఇలాంటి తప్పు మన సినీ పరిశ్రమలో జరగకుండా ఆపగలరని ఆసిస్తూ నేను మనసు చంపుకుని ప్రపంచంలోని మాత్రుమూర్తులకు శతకోటి పాదాభివందనాలు చేస్తున్నాను.) ఇంతలో మన కధానాయకులలో ఒకరు “మీ అమ్మ అడవికి వెళ్ళిందా లేక పులి మీ ఇంటికి వచ్చిందా” అంటాడు. ఈ సంభాషణను అనుమతించిన మన సినీ సెన్సార్ ను ఏమనాలి? ఇకనుంచైనా మన తరువాతి తరాలకు ఇది కేవలం పాటశాలల్లో, దేవాలయాల్లో చదివే మంత్రం కాదని జీవితం లో ఆచరించాల్సిన ధర్మమని నేర్పిద్దాం. మాతృ దేవభవ పితృ దేవోభవ ఆచార్య దేవోభవ
అభిప్రాయములు »
ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI
ప్రత్యుత్తరమిమ్ము
WordPress.com లో Blog పెట్టుము. | Theme: Pool by Borja Fernandez.
ఎంట్రీలు మరియు వ్యాఖ్యలు feeds.
సాగర్,
చాలా బాగా రాసావు. ఇలానే కొనసాగించు.
Comment by Murali— నవంబరు 14, 2008 #
అయ్యా! మీ హృదయం లోంచొచ్చిన ఈ ఆవేదన 99% ప్రేక్షకుల స్పందన. బిడ్డలను గన్న తల్లి దండ్రులు, పాఠాలు నేర్పే గురువులూ, పెక్కురు విద్యార్థులూ, సమాజంలో మంచినే కాంక్షించే మహనుభావులూ, విస్వనాధ వంటి ప్రముఖ దర్శక నిర్మాతలూ, లోక్ సత్తా వంటి నిజాయితీని నిలపాలనుకొనే ప్రముఖ పార్టీల నాయకులగు జయప్రకాష్ వంటి నయకులూ, ఎందరో మహిళా మణులూ, చలన చిత్రాస్లలోను,టీ.వీ. లలోనూ,కనిపించే కొన్ని సన్నివేసాలకు చాలా ఆందోళన చెందుతున్నారు. ఇది నగ్న సత్యము.
కొందరు నిర్మాతలూ, దర్శకులూ, చిత్ర నిర్మాణంలో ధన సంబంధాన్నే తప్ప మానవ సంబంధాన్ని మచ్చుకైనా గుర్తుంచుకోవడం లేదు. వారి నిర్మాణ నైపుణ్యాన్ని జ్ఞానాన్ని వారికి తోచిన రీతిలో చిత్ర నిర్మాణంలో ఉపయోగించెస్తున్నారే తప్ప ఆ చిత్రాన్ని చూచే ప్రేక్సకులపై అది యెంత ప్రభావం చూపుతుందన్న విషయం కొంచెమైనా ఆలోచించకపోవడం విచారకరం.
మనం బ్రతకడంలో తప్పు లేదు. మన బ్రతుకు కోసం జీవనాధారాన్నెంచుకోవడంలో తప్పు లేదు. ఐతే మన బ్రతుకు వల్ల గాని, మన మెంచుకొన్న జీవనాధార బ్రతుకు మార్గం వల్ల గాని మనం బ్రతుకుతున్న సమాజంలోనున్న మరొకరికి ఏవిధమైన నష్టన్నికాని, హానిని కాని కలిగించ కూడదనే ప్రాథమిక సూత్రాన్ని విస్మరించకూడదుకదా? వ్యాపారులైన నిర్మాతల వల్ల తప్పు పూర్తిగా లేదు. ఎందుకంటే బోలేడు అప్పులు చేసి చిత్ర నిర్మాణం చేస్తారు. ఆ దబ్బు తిరిగి రాబట్టుకోడానికి అనేక జిమ్మిక్కులు చేస్తారు. ఐతే సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్టివ్వకుండా చిత్రాన్ని విడుదల చేయలేరుకదా! మరి యీ సెన్సారు బోర్డు యేం చేస్తోంది?
ఈ సెన్సార్ బోర్డుకి కూడా నియమ నిబంధనలున్నాయి. వాటిలోనూ వారి అభిప్రాయాల కనిగుణంగా సమర్ధించుకోడానికి వీలుగా బోలెడు లొసుగులున్నాయి. అందుచేతనే యీ సమాజానికి యీ దౌర్భాగ్యం దాపురించింది.
మానవ హక్కులను కాపాడే సంస్థలున్నాయి. మహిళా హక్కులను కాపాడే సంస్థలున్నాయి. ఈ సంస్థలనుండి ఎంపిక చేసిన వ్యక్తులనుకూడా సెన్సార్ బోర్దు సభ్యులుగా చేస్తే యేమైనా మార్పు రావచ్చునేమో. ఈ ఆలోచన ప్రభుత్వానికి కలిగేదెప్పుడూ ? కలిగించేదెవ్వరూ….? ఈ కలి యుగంలో కృత యుగాన్ని చూడగలిగే దెప్పుడూ….? ఏమో …. వేచి చూడడం తప్ప చేయగలిగిందేముంది……..?
Comment by chinta rama krishnarao.— నవంబరు 16, 2008 #